రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవించడం లేదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం సతీసమేతంగా రాకుండా గత మూడు సంవత్సరాలుగా ఆయన ఒక్కరే వచ్చి సమర్పించడం సరైన పద్ధతి కాదన్నారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయాల్లో, దైవకార్యాలకు సతి సమేతంగా పూజలు చేయడం వ్రతాలు చేయడం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అయితే సీఎం జగన్ ఇలా ఒంటరిగా సమర్పించడం హిందూ సంప్రదాయాన్ని కాలరాయడమే అని విమర్శించారు.