కుప్పం మండలానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం నాయుడును పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు జారి చేశారు. ఈ సందర్భంగా జయరాం నాయుడు మాట్లాడుతూ. తనపై నమ్మకంతో పార్టీ అధిష్టానం జిల్లా స్థాయిలో పదవిని ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన జయరాం నాయుడిని స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు.