గుడిపల్లి మండలం గుండ్లసాగరం గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని స్తానికులు కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు గుడిపల్లె పోలీసులకు సమాచరం అదించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.