అమెరికా డాలర్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో అమెరికా డాలర్ పెరిగింది. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలన్నీ తమ విలువను కోల్పోతున్నాయి. భారత కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూ.82కు సమీపంలో చేరింది. చైనా కరెన్సీ విలువ కూడా తగ్గింది. 2011 నుంచి ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి చైనా కరెన్సీ యువాన్ చేరింది. డాలర్ తో పోలిస్తే పౌండ్, యూరోల విలువ తగ్గింది.