పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మున్సిపల్ సమావేశము బుధవారం నాడు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీ లో 2వ వార్డులో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా మున్సిపాలిటీ ఆలోచించడం లేదని అవార్డు కౌన్సిలర్ బడగల సుజాత తన ఆవేదన వెల్లగక్కారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం, తాను అధికార పార్టీలో ఉండి కూడా మున్సిపల్ అధికారులు చేయకపోవడం, తనకు అసహనానికి గురిచేస్తుందని ఆమె వా పోయారు. తమ వార్డును పరిశీలించి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె చైర్మన్, కమిషనర్ లకు వినతి పత్రం అందజేశారు.