రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 29న ఉదయం ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో ఆమదాలవలస చేరుకొని అనంతరం ఉదయం 05. 40 గం. లకు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేసుకోనున్నారు. ఉదయం 09. 30 గం. లకు శ్రీకాకుళం నుండి బయలుదేరి 10. 00 గం. లకు ఆమదాలవలస శాసన సభాపతి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 10. 30 గం. లకు ఆమదాలవలస నుండి బయలుదేరి 11. 00 గం. లకు బూర్జ మండలం పెద్దపేటలో నిర్మించనున్న ఉద్యాన పరిశోధనా కేంద్రం భవన శంఖుస్థాపన కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి పాల్గొంటారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన ఆమదాలవలస వంశధార వసతి గృహానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 02. 30 గం. లకు బయలుదేరి 03. 00 గం. లకు ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాంతో కలసి పాల్గొంటారని చెప్పారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన సాయంత్రం 5. 00 గం. లకు తొగరాం నుండి విశాఖపట్నంకు బయలుదేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.