గుంటూరు, తాడికొండ: ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి నుండి 1. 5 లక్షలు వసూలు చేసిన ఘటన మేడికొండూరు మండలంలో చోటుచేసుకుంది. డోకిపర్రు గ్రామానికి చెందిన సతీష్ కుమార్ డిగ్రీ చదివాడు. సతీష్ కు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నల్లపాడు కు చెందిన నజీముద్దీన్ అనే వ్యక్తి నమ్మబలికి అతని వద్ద నుంచి విడుదల వారీగా 1. 5 లక్షలు నగదు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.