అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్ వర్క్ లను నిరోధించేందుకు 'ఆపరేషన్ గరుడ' పేరుతో దేశవ్యాప్తంగా సీబీఐ తనిఖీలు చేస్తోంది. దాదాపు 6,600 మంది అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్టు చేసింది. 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1,365 గ్రాముల మెఫెడ్రోన్, 946 అల్ఫాజోలమ్ ట్యా బ్లెట్లను సీజ్ చేసింది.