జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద పక్కా గృహ నిర్మాణ లబ్ధిదారులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఇబ్రహీంపట్నంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పాల్గొని గుంటుపల్లికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.