ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్ 40వ స్థానంలో నిలిచి చరిత్ర నెలకొల్పింది. 2015లో ఈ జాబితాలో 81వ స్థానంలో భారత్ ఉంది. గత ఏడేళ్లలో భారత్ సాధించిన అభివృద్ధికి తాజా ర్యాంకు నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ మునుపెన్నడూ లేనంతగా భారత్ ఆవిష్కరణల రంగంలో దూసుకుపోతోందని అన్నారు. రాబోవు రోజుల్లో మరింత పైకి చేరుకుంటుందని తెలిపారు.