రాజుపాలెం మండలం కేంద్రంలో వైయస్సార్ చేయూత చెక్కుల కార్యక్రమం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంబాబు మాట్లాడుతూ సీఎం మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అని పేద బడుగు బలహీన వర్గాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు, జెడ్పిటిసి సునీత శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి, వైసీపీ నాయకులు బాసులింగారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.