విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని జీవీఎల్ పేర్కొన్నారు. లాసెన్స్‌బే కాలనీలో బీజీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి మీరు చేసింది ఏమిటి? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. భూ కబ్జాలు తప్ప మరేం చేశారు? ఈ ప్రాంతాన్ని కూడా తమ కబ్జాలోకి తెచ్చుకోవాలన్న ఉత్సాహం తప్ప మీకేం బాధ్యత ఉందని ప్రశ్నించారు. టూరిస్టు కేంద్రమైన విశాఖలో టూరిజం అభివృద్ధి ఎక్కడుందన్నారు. రుషికొండ రిసార్టు రహస్యం ఏమిటి? అక్కడ ఏమి కడుతున్నారు? ఇప్పటికీ ప్రభుత్వం ధైర్యంగా చెప్పలేకపోతోందన్నారు.
అంతా అవితీని అక్రమాలతో పాలన సాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని జీవీఎస్ స్పష్టం చేశారు. దండు బజార్లో నలభై ఏళ్లుగా ఉంటున్న బడుగు బలహీన వర్గాల వారికి వక్ఫ్ పేరిట అనుమతులు నిరాకరిస్తు న్నారు. వారిని ఎందుక ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 30 వేల మందిది ఇదే సమస్య. 22A సామాన్యులకు. దస్పల్లా భూములకు మాత్రం అనుమతులు ఆఘమేఘాల మీద ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాల మీద తక్షణం సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.