కృష్ణా: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడిచిన మూడెళ్లలో రాష్ట్రంలో దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటిని విప్లవాత్మకంగా పరిష్కరిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
శుక్రవారం ఉదయం కృష్ణాజిల్లా పెడన టౌన్ లోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళాను మంత్రి శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబు ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు.