బీహార్లోని భాగల్పూర్లో అత్యంత దారుణ ఘటన జరిగింది. రాజేష్ కుమార్, పుష్పాదేవి భార్యాభర్తలు. ఇటీవల మరో మహిళతో రాజేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది మానేయాలని చెప్పిన భార్యపై కోపం పెంచుకున్నాడు. భార్యపై గురువారం కిరోసిన్ పోసి నిప్పటించబోయాడు. తప్పించుకున్న బాధితురాలు నేరుగా ఎస్ఎస్పీ ఆఫీసుకు వెళ్లింది. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.