ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. శుక్రవారం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళుతుండగా ఓ అంబులెన్స్‌ను ప్రధాని మోడీ గమనించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి కాన్వాయ్‌ను పక్కకు ఆపించారు. అంబులెన్స్‌ను పోనిచ్చేందుకు మార్గం సుగమం చేశారు. ఈ వీడియోను బీజేపీ నేతలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రధాని మానవత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa