దసరా పండుగని లేదా ఏదైనా వేడుక కోసమై ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది అని జాగ్రత్తగా ఉండాలి అని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఒరిజినల్ వెబ్ సైట్స్ లను పోలి ఉండే నకిలీ వెబ్ సైట్స్ లలో దుస్తులు మరియు గృహోప కరణాల పై భారీగా రాయితీలను ప్రకటిస్తున్నారు అని అన్నారు.