గర్భిణీ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, పిల్లల పోషకాహారం, విద్య సక్రమంగా నిర్వహించాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయ భవనం నందు ఐ. సి. డి. ఎస్ వారి అధ్యరంలో నిర్వహించిన"పోషకాహార మహోత్సవాలు"కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొరముట్ల పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఐ. సి. డి. ఎస్ వారు అందించే ఆహారాన్ని, స్టాల్ల్స్ ను పరిశీలించారు. అంగన్వాడీ వర్కర్లుకు, సూపర్వైజర్లకు ట్యాబులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మహిళలు, పిల్లలకు సంప్రదాయ ఆహారం అందించేయాలన్నారు. బాల్య వివాహాల్ని అరికట్టాల్సిన బాధ్యత మీదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, ఎంపీపీ సింగనమల భవాని, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజరెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, హౌసింగ్ డైరెక్టర్ ప్రశాంతిరమేష్, సర్పంచ్ శివయ్య, ఉపసర్పంచ్ తోట శివసాయి, ఎమ్మార్వో రామ్మోహన్, ఈఓపిఅర్డి నాగార్జున పాల్గొన్నారు