రాబోవు శాసనసభ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని పాతపట్నం మండలంలో పోలింగ్ బూతుల నిర్వహణ మరియు ఓటర్ జాబితా విషయంలో మండల తాసిల్దార్ రవిచంద్ర తో పాతపట్నం మండల వైసిపి నాయకులు శుక్రవారం నాడు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఏఎంసీ చైర్మన్ కొండల అర్జునరావు , కో దూ రు సర్పంచ్ పనుకు మోహన్, తిట్టిమి సర్పంచ్ ప్రతినిధి తూలుగు ప్రవీణ్, తిట్టిమి ఎంపిటిసి కొప్పల గీత, బూరగం సర్పంచ్ ప్రహ్లాదపులై, బోరుభద్ర సర్పంచ్ సవిరిగాన శ్రీను, పి ఎల్ పురం సర్పంచ్ ఆనెము ఉమమహేశ్వరరావు , గిరిజన నాయకుడు కోదురు అప్పన్న, మండల పార్టీ కార్యదర్శి గోకవలస రాము తోపాటు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa