వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. పథకం అమలులో అత్యుత్తమంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా కేంద్రం అందించిన అవార్డుల గురించి ఆ శాఖ మంత్రి విడదల రజని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు.
ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వచ్చేలా పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa