శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో మాజీ మంత్రివర్యులు విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. శనివారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామలా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు.