అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కిరాయి గూండాలకు సుపారి ఇచ్చి భర్తను చంపిన వైనం కుప్పం మండలంలో చోటు చేసుకుంది. బ్శనివారం పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల ప్రకారం. కుప్పం మండలం గరిగచీనేపల్లికి చెందిన హరీష్ భార్య స్నేహ రామకుప్పం మండలానికి చెందిన సతీష్ నాయక్ తో అక్రమ సంబందం నడుపుతోంది.
ఈ క్రమంలో స్నేహ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త హరీష్ ను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడు సతీష్ తో కలిసి పథకం వేసింది. రామకుప్పం మండలానికి చెందిన సతీష్ తన స్నేహితులకు 5 లక్షలు సుపారీ ఇచ్చి హరీష్ ను కుప్పం మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి గొంతుకోసి హత్య చేశారని తమ విచారణలో తేలిందని డిఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని శనివారం అరెస్టు చేసి రిమాండు తరలించామన్నారు. డిఎస్పీ వెంట అర్బన్ సిఐ శ్రీధర్, ఎస్సైలు లక్ష్మీరెడ్డి, శివకుమార్ ఉన్నారు.