శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గత కొద్ది రోజులుగా వరద ప్రవాహం తగ్గడంతో డ్యాం గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. జూరాల, సుంకేసుల, హంద్రీ ల నుంచి 71, 929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. గురు, శుక్రవారం వరకు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 13. 149 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 11. 243 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జున సాగర్ కు 50, 860 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 15, 00 క్యూసెక్కులు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 1, 350 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1, 600 క్యూసెక్కుల నీటిని వదిలారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 1. 20 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం 193. 8593 టీఎంసీల నీటితో 881. 10 అడుగులకు జలాశయం నీటిమట్టం చేరుకుంది.