కుప్పం పట్టణంలోని రాధాకృష్ణ రోడ్డులో వెలసిన ముత్తుమారెమ్మ ఆలయంలో శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి శనివారం వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. కూరగాలతో అమ్మవారిని అలంకరించడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.