పెళ్లైన ఆరేళ్లకు తన భార్య మహిళ కాదంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనా ప్రాంతానికి చెందిన యువతితో 2016లో పెళ్లైంది. ఆరేళ్లుగా వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా పురుషుడు అని తేలింది. దీంతో తనను మోసం చేశారని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు వారి వివాహాన్ని రద్దు చేసింది.