నవరత్నాల పథకాలతో ప్రతి పేదోడి గడపలు వెలుగులు నిండాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం మండలంలోని టి. ఆర్ కండిగ గ్రామంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అర్హత ఉండి సాంకేతిక కారణాలవల్ల లబ్ధి పొందని వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. నవరత్నాలతో ప్రతి ఇంట వెలుగులు వచ్చాయని గత మూడేళ్ల కాలంలో అందిన పథకాలను వివరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మదన్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి , ధర్మయ్య , తదితరులు పాల్గొన్నారు.