మహిళల ఆసియా కప్ 2022లో భాగంగా శ్రీలంక జట్టుతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ ఆసియా కప్లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడింది. స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) జెమీమాకు చక్కటి సహకారం అందించింది. శ్రీలంక బౌలర్లలో రణసింగ్ 3 వికెట్లు తీశాడు. చివర్లో హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9)లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో ప్రత్యర్థి ముందు భారత్ మెరుగైన స్కోరును నిలబెట్టుకోగలిగింది.