పెట్రోల్ ధరలు భరించలేక చాలా మంది ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. అయితే సరైన వాహనాలను ఎంచుకోకపోవడం, వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో వాటి బ్యాటరీలో పేలిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. మంటలు వస్తున్న స్కూటర్‌పై నీళ్లు పోసినా అవి తగ్గలేదు. పైగా కాసేపటికే అకస్మాత్తుగా ఆ బైక్ పేలిపోయింది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే విషయం అర్థం అవుతోంది.