ఆత్మకూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు ఆత్మకూరు ఓలవరెడ్డి, ఈశ్వ రమ్మ దంపతులు ఆరోగ్యం బాగా లేకపోవడంతో 20రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడి నుంచి పెద్ద వడగూరు మండలంలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. శనివారం పింఛను తీసుకునేందుకు వచ్చిన వారు ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచిన రూ. 1. 50 లక్షలు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు. చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.