పెద్దవడుగూరు: మండలంలోని కిష్టిపాడు సచి వాలయం-2లో సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు శనివారం సమస్యలు విన్నవించేందుకు సచివాలయానికి వెళ్లారు. ఉదయం 10: 45 గంటలైనా సిబ్బంది ఎవరూ రాకపోవడంతో వారు నిరీక్షించారు. 11. 00కు సిబ్బంది వచ్చారు. ఈ విషయమై ఎంపీడీవో కుళ్లాయిస్వామిని విచారించగా సిబ్బంది ఆలస్యంగా వస్తున్న విషయం తమకు తెలియదన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.