గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఎవరైనా మాంసం విక్రయాలుకానీ, చేపల విక్రయాలు కానీ చేపడితే వారిపై కేసులు నమోదు చేయించడం జరుగుతుందని హిందూపురం కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎవరైనా మాంసం విక్రయాలు చేపడితే మాంసం స్వాదీనం చేసుకుని షాపు సీజ్ చేసి పోలీసుల ద్వారా కేసు నమోదు చేయించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పట్టణంలోని మాంసం విక్రయ దారులు గమనించాలన్నారు.