తాడిపత్రి: భర్తను రోకలి బండతో బాది హతమార్చిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ ఆనందరావు వెల్లడించారు. ఈ నెల 29న తాడిపత్రిలోని గాంధీకట్ట వద్ద నివాసముంటున్న షేక్ అబ్దుల్ బాషా మద్యం మత్తులో తన భార్య ఆయేషాను వేధించడమే కాక చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో విసుగు చెందిన ఆమె అదే రోజు అర్ధరాత్రి నిద్రిస్తున్న అబ్దుల్బాషాపై రోకలి బండతో దాడి చేసి హతమార్చింది. హతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనం తరం ఆయేషాను శనివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.