రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెదేపా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు పేర్కొన్నారు. పుల్లలచేరువు మండలంలోని సుద్దకురవ తండాలో తెదేపా మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు ఆకాశాన్ని అంటాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి వైకాపా అరాచకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచి పెట్టారు.