తెనాలి పరిసరాల పరిశుభ్రత కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం, దోమతెరలు వాడడం, పరిశుభ్రమైన ఆహారం తినడం వంటి జాగ్రత్తలు పాటించి, వైరల్ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ జవ్వాజి కోటి నాగయ్య చెప్పారు. శనివారం సుల్తానాబాద్ లో నిర్వహించిన అడగండి చెబుతాం కార్యక్రమంలో ఇంటింటికి జ్వరాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు.