అసలే ఉరుకుల, పరుగుల జీవితం.. తినడానికే తీరిక ఉండని వేళలు.. టైం లేదని చెప్పి ఏదో గబాగబా తినేవాళ్లు చాలామంది ఉన్నారు. కొందరైతే పనిలో పడి తిండి విషయమే మరిచిపోతుంటారు. ఇక మాంసం అంటే చాలు లొట్టలేసుకుని తినే భోజన ప్రియులు చాలా మంది ఉన్నారు. వారానికి రెండు.. మూడు రోజులు మీట్ లాంగించే వారు కూడా ఉన్నారు. మాంసాహారం అతిగా తింటే రోగాల బారిన పడాల్సివస్తుంది. ఆవు, మేక, పంది మాంసాలు(రెడ్ మీట్) బాగా తినేవారి ధమనుల్లో చెడు కొలెస్టరాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మాంసాన్ని మరి మితిమీరి తినకుండా.. అప్పుడప్పుడు తింటే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం మాసం తినడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.....
1.క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది :కోళ్లు, ఆవులు మరియు ఇతర జంతువులను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మాంసం తినేవారితో పోలిస్తే శాకాహారులలో క్యాన్సర్ వచ్చే అవకాశం 40 శాతం కంటే తక్కువగా ఉందని ఇంగ్లాండ్, జర్మనీలలోని యూనివర్సిటీలు తేల్చి చెప్పాయి. అధిక మొత్తంలో ప్రోటీన్ కలిగిన ఆహారాలు, ముఖ్యంగా మాంసం అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మాంసంలో ప్రోటీన్‌తో పాటు క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసం తింటున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2.గుండె జబ్బు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది :నేటి తరం ఎక్కువగా బాధపడే ఆరోగ్య సమస్యల్లో గుండె సమస్య ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. నిత్యం తీసుకునే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులే దీనికి కారణం. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాక్ అయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. మాంసం తినడం వల్ల అందులోని ప్రోటీన్లు, కొవ్వులు మధుమేహానికి దారితీస్తాయి. మాంసం తినేవారిలో ఎక్కువ మందికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
3.శరీర బరువును నియంత్రించలేరు :మాంసం తింటే శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), ట్రై గ్లిజరైడ్లు చేరతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. మాంసం వల్ల పెరిగిన శరీర బరువును ఆ తర్వాత ఎన్ని వ్యాయామాలు చేసిన తగ్గించుకునేందుకు కష్టతరమవుతుంది. శరీర బరువును నియంత్రించలేకపోయే ప్రమాదం ఉంటుంది.
4.అనారోగ్యం వాటిల్లే ప్రమాదముంది : మాంసం తింటే రక రకాల రోగాలోస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మాంసం తినే వారికి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఆయుష్షు తో చనిపోయే వారు, గుండెపోటుతో బాధపడే వారు కుడా ఎక్కువగా మాంసం తింటున్నట్లు పరిశోధనలు తేల్చాయి. మాంసం అరగక ప్రేగు కాన్సర్ వచ్చే వారు కుడా చాలా మందే ఉన్నారు. మధుమేహం భారినపడే అవకాశం కూడా ఉంది. మాంసం తింటే తరచూ అనారోగ్య సమస్యలు దరిచేరడం ఖాయం.
5. అంగస్తంభన సమస్య :మాంసం తినడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది నెమ్మదిగా సాగుతుంది. మాంసం అధికంగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, డయాబెటిస్, ప్రోస్టేట్ క్యాన్సర్, అల్సర్ వంటివి వచ్చి హార్మోన్ల సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల నపుంసకత్వం కూడా వచ్చే అవకాశం ఉంది. మాంసం తింటున్న పురుషులలో అంగస్తంభన సమస్య అనేది ఎక్కువవుతోందని, దీని ద్వారా పురుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు.