చిలకలూరిపేట పట్టణంలోని చార్లెస్ స్కూల్ దగ్గర ఆదివారం రాత్రి రాజీవ్ సాయి (8)అనే బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు. కిడ్నాపర్లు బాలుడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలూరిపేట పట్టణ సీఐ రాజేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేయటం పట్ల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది.