రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి పోయిందని చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, పొలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభాభారతి అన్నారు. ఆదివారం నాడు వంగర మండలం లో అరసాడా గ్రామం లో నిర్మించిన రైస్ మిల్లును కళావెంకట్రావు, ప్రతిభాభారతి లు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధికి పూర్తిగా శూన్యమన్నారు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ముఖ్యమంత్రిగా చూడాలంటే రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించి పంపించాలని వారు కోరారు.
గత మూడున్నర ఏళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ఓ పది రూపాయలు పేదలకు ఇచ్చి, వంద రూపాయలు లాక్కున్నారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం జగన్మోహన్రెడ్డి పతనానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.