ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 55-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.