అక్టోబరు14 నుంచి18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ పార్టీ 24 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాల పోలారావులు కోరారు. టెక్కలి మండలం మాదినవానిపేట దళిత వాడలో ఇంటింటా ప్రచారం చేస్తూ జాతీయ మహాసభలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ. ఐ. టి. యు. సి. జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు మాట్లాడుతూ జమీందారు, ప్యూఢల్ అవశేషాలకు వ్యతిరేకంగా, బ్రిటీష్ కాలంలో జాతీయోద్యమ కాలంలోనూ, స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ప్రజలకు అండగా సీపీఐ పార్టీ ఉద్యమాలు చేసిందని అన్నారు. ప్రాణ త్యాగాలు, అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర సీపీఐ పార్టీదని అన్నారు. మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగానూ మారారని అన్నారు. 2014 లో పదిహేడు వేల కోట్లు ఆదాయం కలిగిన ఆదానీ ఎనిమిదేళ్లలో పదిన్నర లక్షల కోట్లు సంపాదించారని అన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సామాన్య మధ్య తరగతి ప్రజలు మోడీ పాలనలో చతికిల పడ్డారని అన్నారు. అక్టోబరు14వ తేదీన విజయవాడలో జరిగే మహా ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసవల అప్పారావు, నక్క భాస్కరరావు, కూరాకుల ప్రకాష్, చింతాడ వాసు, చింతాడ గౌరీ శంకరరావు, చింతాడ లక్ష్మణ. సి. హెచ్. ధర్మారావు, కె. జోగారావు, చందనం, వై. శంకరరావు, లక్షుమయ్య, సాయి కుమార్, పురుషోత్తం, విజయరావు, లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.