వాల్తేరు డివిజన్ టిక్కెట్ తనిఖీలో గతంలోని అన్ని రికార్డులను అధిగమించి అత్యధిక ఆదాయాన్ని సాధించిందని డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ అనూప్ సత్పతి అన్నారు. సెప్టెంబరు-2022 నెల వరకు టిక్కెట్ తనిఖీ డ్రైవ్‌లలో డివిజన్ రూ. 17. 59 కోట్లు ఆర్జించిందని 2. 88 లక్షల కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు విశాఖ రైల్వే స్టేషన్ లో టికెట్ల తనిఖీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ ఆకస్మిక తనిఖీలు, మిడ్-సెక్షన్ తనిఖీలు, భారీ తనిఖీలు, రైల్వే బోర్డు ద్వారా స్పెషల్ డ్రైవ్‌లు మొదలైన వాటితో కూడిన 165 డ్రైవ్‌లు ఈ సెప్టెంబర్‌లో జరిగాయని అన్నారు.
అలాగే అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ టిక్కెట్లు తీసుకోవడానికి, టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేయకూడదని, చైన్‌పుల్లింగ్ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వాణిజ్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.