అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్ సర్కార్ మంగళవారం మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తూర్పు వైపు గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ వెల్లడించింది.