కోటనందూరు మండలం తాటిపాక చెందిన అల్లు రమణమ్మ (30) కుటుంబ తగాదాల నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించే మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించాలని సూచించగా, తుని పట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చేర్చినట్లు తెలిసింది. సుమారు 15 ఏళ్ల క్రితం వివాహమైన ఈమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం, రైల్వే పోలీసులును వివరణ కోరగా కేసు నమోదు చేయలేదన్నారు.