ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పేరు మార్పు మరో తుగ్లక్ చర్య: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 07:44 PM

విజయనగరంలో ఉన్న మహారాజా ఆసుపత్రి పేరు తొలగింపు మరో తుగ్లక్ చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చడంపై ఆయన స్పందించారు.   హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించిన ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైందని తెలిపారు. నాడు మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్టుల నుంచి అశోక్ గజపతిరాజు గారిని ఇలాగే తప్పించి కోర్టుతో చీవాట్లు తిన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  "అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు... ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం జగన్ వెనక్కి తగ్గాల్సిందే" అంటూ డిమాండ్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com