అద్దంకిలో దొంగతనాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున దుండగులు అమరావతి నెట్ అండ్ జిరాక్స్ దుకాణంలో రేకులు పగలకొట్టి 58 వేల రూపాయల నగదు దోచుకు వెళ్లారు. ఉదయాన్నే షాపు యజమాని షట్టర్ తెరిచి చూడగా దొంగతనం బయటపడింది. వెంటనే షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.