బీహార్లోని బంకా జిల్లాలో దారుణం జరిగింది. అమర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహోటా గ్రామంలో దీపక్ శర్మ మంత్ర విద్యలు సాధన చేస్తుంటాడు. క్షుద్ర పూజల్లో భాగంగా తన ఏడేళ్ల కుమారుడు రాఘవ్ కుమార్ను గొంతు కోసి చంపాడు. బాలుడి తల్లి ఖుష్బూ దేవి పోలీసులకు సమాచారం ఇచ్చింది. విజయదశమి రోజు రాత్రి తన కొడుకును భర్త హత్య చేశాడని తెలిపింది. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.