ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ దంత సంరక్షణ తప్పనిసరని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ యోగానందరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు స్థానిక మోడంపల్లెలోని డిబిసిఎస్ పురపాలక పాఠశాలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళయిన సందర్బంగా శుక్రవారం అటామి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మధురం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు పాఠశాలలోని విద్యార్థులకు టూత్ పేస్టు, బ్రష్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే దంత సంరక్షణ అలవర్చుకోవాలని, రోజుకు రెండు మార్లు దంతాలను శుభ్రపరచుకోవాలని తెలిపారు. దృఢమైన ఆరోగ్యవంతమైన దంతాలు మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ ఏ. వెంకటరమణ, డైరెక్టర్ మృదుల, అటామి సంస్థ లీడర్ లక్ష్మి నారాయణ(లక్ష్మణ్), అవేక్ అండ్ అరైజ్ సంస్థ ప్రిన్సిపాల్ శివాజీ శంకర్, మురళీశ్వర్ రెడ్డి, లత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.