జీవిత బీమా ఏజెంట్ల న్యాయపరమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలంటూ లియాఫీ నాయకులు శుక్రవారం జమ్మలమడుగు పట్టణంలోని స్థానిక ఎల్ ఐ సి కార్యాలయం ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లియాఫ్ నాయకులు శివరాంరెడ్డి , శేఖర్ లు మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీదారులకు మెరుగైన సేవలను అందించాలని పాలసి దారులు కట్టే ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచడంతోపాటు, రుణాలపై వడ్డీరేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకు ఇచ్చే బాండ్లను పాత పద్ధతిలోనే ఇచ్చేలా చేయాలన్నారు.