వికేంద్రీకరణ చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎర్రగుంట్ల మునిసిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చేశారని, కానీ రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒట్టి చేతులతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. అందుకు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు అవసరమన్నారు దీనికి ప్రజలు మద్దతు కూడా ఉందన్నారు.