చంద్రుడిపై పరిశోధనల్లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించేందుకు చేపట్టిన చంద్రయాన్2 పలు కీలక సమాచారాన్ని అందించింది. చంద్రుడిపై అధికంగా సోడియం ఉన్నట్లు గుర్తించింది. చంద్రుడిపై ఉన్న సోడియం నిల్వలను ఈ పరికరం మ్యాపింగ్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది.