గుండెపోటు మరణాల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణంచిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే గత దశాబ్దంలోనే ఇండియాలో 2.40 లక్షల మందికిపైగా గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. 2021 గణాంకాల ప్రకారం 45 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఎక్కువగా గుండెపోటుతోనే మరణిస్తున్నట్లు తేలింది.