యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన సమాజ్ వాద్ పార్టీ అధినేతగా పని చేశారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా సీఎంగా పని చేశారు. ములాయం గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు.ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. అత్యాధునిక వైద్య సేవలను అందించారు. అయినప్పటికీ- ఫలితం రాలేదు.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ములాయం సింగ్ యాదవ్. దీన్ని గమనించిన డాక్టర్లు హుటాహుటిన ఐసీయూ నంబర్ 5కు తరలించారు. ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల కఠారియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. ములాయం సింగ్ యాదవ్‌ను ఐసీయూలోకి తరలించినట్లు సమాచారం అందిన వెంటనే కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్.. హుటాహుటిన మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు.